భారతదేశం, ఫిబ్రవరి 1 -- తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్ లో విష్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కచ్చితంగా ఉంటారు. కెరీర్ ఆరంభంలో విష్వక్ సేక్ కు ఈ నగరానికి ఏమైంది? లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన దర్శకత్వ కెరీర్ పరంగానూ అది ప్లస్ అయింది. విష్వక్ సేన్ తో తన స్నేహం గురించి చెప్తూ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు తరుణ్.

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ప్రమోషన్లలో భాగంగా తరుణ్ భాస్కర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు.

''రీసెంట్ గా రాత్రి 2 గంటలకు ఊబర్ క్యాబ్ డ్రైవర్ తో గొడవైంది. రెండు స్టాప్స్ పెడితే పెట్టొద్దంటాడు. మరి యాప్ లో ఎందుకిచ్చారు? నాకు సంబంధం లేదు కదా. వాడితో గొడవ అయితుంటే విష్వక్ కాల్ చేశాడు. ఎక్కడున్నావ్ అని అడిగాడు. క్యాబ్ డ్రైవర్ తో గొడవ అనగానే వాడి బండేసుకుని వచ్చాడు...