భారతదేశం, ఫిబ్రవరి 6 -- దిగ్గజ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి స్పీచ్ అదరగొట్టారు. రాజ్యసభ ఎంపీగా ఆయన సభలో ప్రసంగించారు. తన స్పీచ్ లో భాగంగా కల్కి 2898 ఏడీలో తన క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ ను కమల్ హాసన్ సభలో చెప్పడం వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగం చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలోని తన పాత్ర సుప్రీం యాస్కిన్ చెప్పిన ప్రసిద్ధ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. ఈ తెలుగు సినిమా డైలాగ్‌ను పార్లమెంట్‌లో ఆయన చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"ప్రజాస్వామ్య శక్తితో మనం ముందుకు సాగడానికి సహకరించండి. లేదా ఈ ప్రజాస్వామ్య గణతంత్ర మార్గం నుండి తప్పుకోండి'' అని ఇంగ్ల...