భారతదేశం, మే 22 -- తమిళ కామెడీ సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ' సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ సాధించింది. పెద్దగా అంచనాలు లేకుండా మే 1వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో శశికుమార్, సీనియర్ నటి సిమ్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. సూర్య 'రెట్రో'కు పోటీ దిగిన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ ఊహలకు మంచి సక్సెస్ దక్కించుకుంది. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇంకా మంచి కలెక్షన్లను రాబడుతోంది. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా డీల్ ప్రకారం ఈ మే నెలాఖరులో జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రావాల్సింది. నిర్మాత కూడా గతంలో ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఆలస్యం కానుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా జోరుగా సాగుతోంది. కలెక్ష...