భారతదేశం, ఫిబ్రవరి 23 -- తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపింది. లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్‌లో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాలయ్యారు. బాధితుల‌కు కిడ్నీలు పాడైన‌ట్లు తెలుస్తోంది.. దీనంత‌ట‌కి క‌ల్తీ పాలే కార‌ణ‌మ‌న్న అనుమానాలు బాధితులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు.

'ఈ ఘటన చాలా బాధకరం. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారు. ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. వరలక్ష్మీ డెయిరీకి చెందిన కల్తీ పాల వలనే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసులు నమోదు చేశా...