భారతదేశం, జూలై 30 -- బుధవారం తెల్లవారుజామున రష్యాలోని కంచెట్కా ప్రాంతాన్ని 8.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం కుదిపేసింది. తూర్పు రష్యాలో తీవ్ర ప్రకంపనలకు కారణమైన ఈ భూకంపం.. జపాన్, అమెరికా, పసిఫిక్ దీవుల వంటి పొరుగు దేశాల్లో సునామీ అలజడులను రేపింది.

యూఎస్​ జియోలాజికల్ సర్వే (యూఎస్​జీఎస్​) భూకంప తీవ్రతను 8.8 గా నమోదు చేయడంతో.. ఈ రష్యా భూకంపం గత 14 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్దది. అంతేకాదు, ఇప్పటివరకు నమోదైన వాటిలో ఆరో అతిపెద్ద భూకంపం కూడా!

1960 చిలీ భూకంపం: ఇప్పటివరకు నమోదైన భూకంపాల్లో కెల్లా అత్యంత శక్తివంతమైనది. చిలీలోని వాల్డివియాను 9.4 నుంచి 9.6 తీవ్రతతో కూడిన భూకంపం తాకింది.

1964 అలస్కా భూకంపం: నమోదైన వాటిలో రెండొవ ఇది అతిపెద్ద భూకంపం. అలస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్‌ను 9.2 నుంచి 9.3 తీవ్రతతో కూడిన భూకంపం తాకింది.

2004 హిందూ మహాసముద్ర ...