భారతదేశం, ఫిబ్రవరి 3 -- రష్మిక మందన్న తన పెళ్లి తేదీని పరోక్షంగా కన్ఫమ్ చేసినట్లే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ కపుల్ అయిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న త్వరలో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతేడాది అక్టోబర్ లోనే వీరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని ప్రచారం జరిగినా.. ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న తన హావభావాలతో పెళ్లి వార్తలను పరోక్షంగా ధృవీకరించినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక పురాతన ప్యాలెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లోని తమ సినీ మిత్రుల కోసం భారీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవ...