భారతదేశం, మే 14 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.in లేదా upsconline.gov.in నుంచి యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ సీఎస్​ఈ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరుగుతుంది. అడ్మిట్​ కార్డును డౌన్​లోడ్​ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పరీక్ష తుది ఫలితాలు వెలువడే వరకు యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డును భద్రపరచాలని అభ్యర్థులను కమిషన్ చెప్పింది.

అడ్మిట్ కార్డులతో పాటు అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

Published by HT Digital Content Services with permi...