భారతదేశం, ఆగస్టు 5 -- సాధారణంగా సంస్థలు తమ ఉద్యోగుల జీతాల వివరాలను గోప్యంగా ఉంచుతాయి. అయితే, ఇటీవల వెల్లడైన పబ్లిక్ ఫైలింగ్స్ (అంతర్జాతీయ ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన అధికారిక పత్రాలు) ద్వారా యాపిల్ కంపెనీ తన కీలక ఉద్యోగులకు చెల్లించే వేతనాలను బయటపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా, యాపిల్ తన అత్యుత్తమ టాలెంట్‌ను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి భారీ మొత్తంలో జీతాలను అందిస్తున్నట్లు ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

పలు మీడియా నివేదికల ప్రకారం.. ఈ సమాచారం విదేశీ ఉద్యోగుల నియామకాల కోసం దాఖలు చేసిన పత్రాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ వివరాలు కేవలం ప్రాథమిక జీతాలను మాత్రమే సూచిస్తాయి. ఇటీవల మెటా వంటి ప్రత్యర్థి సంస్థల్లోకి కీలక ఇంజినీర్లు వెళ్లిపోతున్న నేపథ్యంలో, యాపిల్ జీతాల విధానంపై ...