భారతదేశం, ఫిబ్రవరి 4 -- టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో, కాస్త వైలెంట్ టచ్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 13న జపాన్‌లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ప్రమోషన్లలో భాగంగా జపాన్ వెళ్ళిన యానిమల్ మూవీ టీమ్.. అక్కడ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా కథ తనకు ఎందుకు అంత దగ్గరైందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన తరం అబ్బాయిలకు తండ్రితో ఉండే దూరం గురించి కూడా చెప్పాడు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై రణ్‌బీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "నేను సందీప్ గత చిత్రాలను (అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్) బాగా ఇష్టపడ్డాను. అతనితో మొదటిసారి కలిసినప్పుడే మా మధ్య ...