భారతదేశం, జనవరి 19 -- సాధారణంగా రోడ్డు పక్కన దీనస్థితిలో యాచిస్తున్న వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. తమకు తోచిన సహాయం చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం చూస్తే మాత్రం.. మనం ఎవరికి సహాయం చేస్తున్నాం? అనే అనుమానం కలగక మానదు. ఇండోర్‌ను 'భిక్షాటన రహిత' నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఒక 'కోటీశ్వరుడైన బిచ్చగాడు' అధికారుల కంటపడ్డాడు.

ఇండోర్‌లోని ప్రముఖ సరాఫా బజార్ ప్రాంతంలో మాంగీలాల్ అనే వ్యక్తి ఏళ్ల తరబడి భిక్షాటన చేస్తున్నాడు. దివ్యాంగుడు కావడంతో, చేతులతో తోసుకుంటూ వెళ్లే బండిపై తిరుగుతూ అతను అందరినీ సహాయం కోరేవాడు. అతని పరిస్థితి చూసి జాలిపడ్డ జనం రోజుకు రూ. 500 నుండి రూ. 1000 వరకు ఇచ్చేవారు. అయితే, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పునరావాసం కోసం అతన్ని అదుపులోకి తీసుకున...