Hyderabad, జూలై 22 -- ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ రష్మి గౌతమ్ నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు చెప్పింది. వ్యక్తిగతం, కెరీర్ పరంగా తాను కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. మంగళవారం (జులై 22) ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అసలు ఆమెకు ఏమైందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు టీవీ ఛానెల్స్ లోని ప్రముఖ యాంకర్స్ లో ఒకరు రష్మి గౌతమ్. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ తో బాగా పాపులర్ అయింది. తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే కొన్నాళ్లుగా రష్మి పాపులారిటీ తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడదే విషయాన్ని చెబుతూ రష్మి తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. అందులో ఆమె ఏమన్నదో చూడండి.

"అందరికీ నమస్కారం. నేను ఒక నెల రోజుల పాటు అవసరమైన డిజిటల్ డిటాక్స్ తీసుకుంటున్నాను. వ్యక్తిగతంగా, వృత్తి...