Hyderabad, జూన్ 20 -- కేరళ క్రైమ్ ఫైల్స్.. మలయాళంలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ ఇది. 2023లో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు శుక్రవారం (జూన్ 20) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. అహ్మద్ కబీర్ డైరెక్ట్ చేసిన ఈ రెండో సీజన్ తొలి సీజన్ కంటే కూడా ఉత్కంఠగా సాగింది. ఓ మ్యూజియంలో చోరీ, కుక్క హత్య చుట్టూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సిరీస్ ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 మొదట్లో ఓ సింపుల్ మిస్సింగ్ స్టోరీగా మొదలవుతుంది. మాఫియా, అండర్ వరల్డ్ తో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో మొదట్లోనే కొందరు పోలీస్ అధికారులను బదిలీ చేయడం చూపిస్తారు. అందులో సీపీవో అంబిలి రాజు కూడా ఉంటాడు.

ఆ బదిలీ తర్వాత అంబిలి రాజు కనిపించకుండాపోతాడు. అతన్ని వెతకడం కోసం ఓ పోలీస్ టీమ్ రంగంలోకి దిగుతుంది. కానీ దిగిన తర్వాత ఆ కేసు లోతేంటో...