భారతదేశం, ఏప్రిల్ 13 -- మోటోరోలా నుంచి బిగ్​ అప్డేట్​! రెండు కొత్త గ్యాడ్జెట్స్​ని సంస్థ త్వరలోనే ఇండియాలో లాంచ్​ చేయనుంది. ఏప్రిల్ 17న మోటో ప్యాడ్ 60 ప్రో, మోటో బుక్ 60ని భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్​ను ఏప్రిల్ 15న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. మోటో ప్యాడ్ 60 ప్రో, మోటో బుక్ 60 రెండింటి వివరణాత్మక స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే గ్యాడ్జెట్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటో ప్యాడ్ 60 ప్రో పెద్ద, హై-క్వాలిటీ డిస్​ప్లే, హై పర్ఫార్మెన్స్​ని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన గ్యాడ్జెట్​ అని చెప్పుకోవాలి. ఫ్లిప్​కార్ట్​ లిస్టింగ్ ధృవీకరించినట్లుగా ఈ డివైస్ 12.7 ఇంచ్​ ఎల్సిడీ స్క్రీన్​ని కలిగి ఉంది. ఇది ...