భారతదేశం, ఫిబ్రవరి 2 -- తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 55వ సినిమా (D55) కాస్టింగ్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ వరుసగా నటీనటుల వివరాలను అనౌన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ఇందులో భాగంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ క్రేజీ అప్‌డేట్ రానే వచ్చింది. ఈ మూవీలో కథానాయికగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నట్లు నిర్మాతలు సోమవారం (ఫిబ్రవరి 2) అధికారికంగా అనౌన్స్ చేశారు.

సాయి పల్లవి రాకతో D55 ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. ధనుష్, సాయి పల్లవి కలిసి నటించడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'మారి 2' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అందులో వీరిద్దరి కెమిస్ట్రీ, ఆ సినిమాలోని 'రౌడీ బేబీ' పాటలో వేసిన స్టెప్పులు వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చ...