భారతదేశం, జూన్ 8 -- సొంతంగా ఒక కారు, ఒక ఇల్లు.. సగటు మధ్యతరగతి వ్యక్తి కోరుకునేది ఇదే! కానీ ఇవీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు. మరీ ముఖ్యంగా సొంత ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం అంటే మాటలు కాదు. మరి మీరు మీ మొదటి ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం! కాబట్టి దీనికి సరైన ప్రణాళిక చాలా అవసరం. సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన ఎగ్జైటింగ్​గా ఉన్నప్పటికీ, ప్రారంభం నుంచే మీ రీ-పేమెంట్​ బాధ్యతలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో.. హౌసింగ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్, అర్హత ప్రమాణాలు, గృహ రుణం ప్రక్రియకు అవసరమైన పత్రాల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హోమ్​ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది ఒక ఉచిత ఆన్‌లైన్ సాధనం. ఇది మీ నెలవారీ తిరిగి చెల్లింపు మొత్తాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఇందులో అసలు లోన్ మొత్తం, వర...