భారతదేశం, మే 26 -- ట్రాఫిక్​ సమస్యలు, రోడ్డు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల ఇటీవలి కాలంలో వాహనాల మైలేజ్​ తగ్గిపోతోంది. మార్కెట్​లో ఉన్న 2 వీలర్​ స్కూటర్స్​ చాలా వరకు 45- 55 కి.మీ మైలేజ్​నే ఇస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్​ ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే, అత్యధిక మైలేజ్​ కలిగిన ఒక స్కూటర్​ ఇండియాలో లాంచ్​కి రెడీ అవుతోందని మీకు తెలుసా? ఈ స్కూటర్​ 226 కి.మీ మైలేజ్​ ఇస్తుందని మీకు తెలుసా? టీవీఎస్​ మోటార్​ కంపెనీ తీసుకొస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్​ అయిన జూపిటర్​ 125 సీఎన్జీ గురించి, దాని లాంచ్​- ధర అంచనాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

2025 జనవరిలో జరిగిన భారత్​ మొబిలిటీ ఎక్స్​పోలో ఈ టీవీఎస్​ జూపీటర్​ 125 సీఎన్జీ కాన్సెప్ట్​ని సంస్థ ప్రదర్శించింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది స్టాండర్డ్ జూపిటర్ 125 ఆధారంగా తయారవుతో...