భారతదేశం, మే 5 -- సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్లాస్​ 10, క్లాస్​ 12 ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారు? అన్న విషయంపై బోర్డు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ 'రేపే సీబీఎస్​ఈ ఫలితాలు' అంటూ అనేక వార్తలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు, సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలను మే 6, మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారని తాజాగా ఒక లెటర్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై బోర్డు స్పందించింది. ఈ వార్తలో నిజం లేదని, అఫీషియల్​ అని చెబుతున్న ఆ లెటర్​ ఫేక్​ అని స్పష్టం చేసింది.

వాస్తవానికి సోషల్​ మీడియాలో వైరల్​ అయిన లెటర్​ ఫేక్​ అని నమ్మే విధంగా లేదు! మే 6 ఉదయం 11 గంటలకు సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడతాయి అని చెప్పడంతో పాటు వాటిని ఎలా చెక్​ చేసుక...