భారతదేశం, మే 13 -- భారత్​- పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధానికి బ్రేక్​ వంటి సానుకూల పరిణామాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అత్యంత భారీ లాభాలతో ముగించాయి. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2975 పాయింట్లు పెరిగి 82,430 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 917 పాయింట్లు వృద్ధిచెంది 24,925 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1788 పాయింట్లు పెరిగి 55,383 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1246.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,448.37 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మే​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 9103.7 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 15,189.82 కోట...