భారతదేశం, జనవరి 14 -- ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖలు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రతలు తీసుకునే పనిలో పడ్డాయి. అయితే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా ఈసారి కూడా భారీగానే తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ మేడారం జాతర జరగనుంది. అయితే ఇప్పటికే చాలా మంది మేడారానికి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో భక్తుల మరింత పెరగనుంది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచ...