భారతదేశం, ఫిబ్రవరి 6 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో సామూహిక అత్యాచారం జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై. జాతీయ మహిళా కమిషన్ (NCW) బృందం క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా NCW బృందం ఫిబ్రవరి 5న ములుగు జిల్లాను సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ (SP) మరియు వివిధ శాఖల అధికారులతో బృందం సమావేశమైంది. అలాగే సోషల్ మీడియాలో ప్రచారమైన ప్రాంతాన్ని కూడా పరిశీలించింది.

ప్రాథమిక విచారణ ప్రకారం.. మేడారం జాతరలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. పోలీసుల నుండి పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత.. జాతీయ మహిళా కమిషన్ (NCW) తన తుది నివేదికను సమర్పించనుంది.

"ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ప్రచారం జరుగుతున్న ప్రాంతానికి మేము విచారణ కోసం వచ్చాము. ఇక్కడి...