భారతదేశం, జూన్ 13 -- ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు షాకింగ్ ట్విస్ట్ ను బయటపెట్టారు. హత్య కేసు నుంచి రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీని తప్పించేందుకు మరో ప్లాన్ ను కూడా నిందితులు వేశారు. జూన్ 9న ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో సోనమ్ లొంగిపోయింది.

మేఘాలయలో మరో యువతిని హత్య చేసి ఆ యువతి మృతదేహానికి సోనమ్ కు సంబంధించిన ఆభరణాలు కొన్ని తగిలించి, దాన్ని పూర్తిగా తగలబెట్టి, అది సోనమ్ మృతదేహంగా పోలీసులను నమ్మించాలని నిందితులు ప్లాన్ చేశారు.

నిజం వెలుగులోకి రాకముందే అజ్ఞాతంలో ఉండటానికి సోనమ్ కు మరింత సమయం ఇవ్వాలనేది వారి ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఈ హత్య కుట్రలో రాజ్ కుష్వాహా సూత్రధారి అని, సోనమ్ రఘువంశీ సహ కుట్రదారు అని ఈస్ట్ ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సైమ్ తెలిపారు. రాజా భార్య సోనమ్ రఘువంశీ...