భారతదేశం, ఏప్రిల్ 21 -- మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడాది వయసు ఉన్న చిన్నారి కూడా ఉన్నాడు.

వేగంగా ప్రయాణిస్తున్న కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొని ముగ్గురుమృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో చిన్నారులతో సహా 9మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మెదక్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఏడాది వయసు ఉన్న చిన్నారి ఎండీ గౌస్‌‌తో పాటు , అలీం(45) , అజీమ్‌ బేగం(40) దంపతులు మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చిం...