భారతదేశం, ఫిబ్రవరి 5 -- 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి మెగా హీరోలు వచ్చేస్తున్నారు. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారుతో ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ ఇయర్ లో మెగాస్టార్ మరో సినిమాతో రాబోతున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమ సినిమాలతో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. వీళ్ల మూవీస్, రిలీజ్ డేట్లపై ఓ లుక్కేయండి.

అదరగొట్టిన మెగాస్టార్

2023లో భోళా శంకర్ తర్వాత రెండేళ్ల పాటు చిరంజీవి నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. 2024, 2025 గడిచిపోయాయి. అయితే ఆ లోటు తీర్చేస్తూ 2026 సంక్రాంతికే మన శంకర వరప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ కొట్టారు మెగాస్టార్. రికార్డుల దుమ్ము దులిపిన ఈ మూవీ మరోసారి చిరు మేనియాను ప్రపంచానికి చాటింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ స...