భారతదేశం, మే 14 -- ఏపీ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. గత నెలలో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ గడువు మే 15తో ముగుస్తుంది.మే 15తో ముగియనున్న డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ

ఏపీ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు త్వరతగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డీఎస్సీ -2025 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15తో ముగుస్తుంది.చివరి నిమిషంలో రద్దీని సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా ముందే దరఖాస్తులు సమర్పించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

డిఎస్సీ ఆశావహులు చివరి రోజు వరకూ ఆగకుండా, అర్హత, ఆసక్త...