Hyderabad, జూలై 2 -- మలయాళ చిత్రసీమకు మెగాస్టార్ మమ్ముట్టి ఐదు దశాబ్దాల పాటు చేసిన విశేష సేవలు ఇకపై కొచ్చిలోని ఒక కళాశాలలో ఒక కోర్సుగా అధ్యయనం చేసే వీలు కలగనుంది. ఆన్‌మనోరమ నివేదిక ప్రకారం, కేరళలోని మహారాజాస్ కాలేజీలో 'హిస్టరీ ఆఫ్ మలయాళీ సినిమా' మాడ్యూల్‌లో మమ్ముట్టి సినీ కెరీర్‌ను విద్యార్థులు చదువుకోనున్నారు.

మమ్ముట్టి మలయాళ మెగాస్టార్. 50 ఏళ్లుగా తిరుగులేని కెరీర్ తో, వందల సంఖ్యలో సినిమాలతో అక్కడి ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అలాంటి నటుడి కెరీర్ ఇప్పుడు పుస్తకాల్లో పాఠం కానుండటం నిజంగా విశేషమే. ఆ రిపోర్టు తెలియజేసిన దాని ప్రకారం, మహారాజాస్ కాలేజీలో బీఏ హిస్టరీ చదువుతున్న విద్యార్థులు మమ్ముట్టి జీవితం, సినీ ప్రస్థానం, సినిమాపై అతని ప్రభావం గురించి అధ్యయనం చేస్తారు. 'సెన్సింగ్ సెల్యూలాయిడ్: హిస్టరీ ఆఫ్ మలయాళీ సినిమా' అనే ఛాప్టర్‌లో మమ్ముట్ట...