భారతదేశం, జూన్ 28 -- నథింగ్​ ఫోన్​ 3 లాంచ్​కి సమయం దగ్గరపడుతోంది! ఈ స్మార్ట్​ఫోన్​ జులై 1న అంతర్జాతీయంగా లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను నథింగ్ చాలా సీక్రెట్​గా ఉంచినప్పటికీ, దాని స్పెసిఫికేషన్లు- ఫీచర్ల గురించి అనేక లీక్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

నథింగ్ ఫోన్ 3 డిజైన్​ని కంపెనీ చాలా గోప్యంగా ఉంచింది. ఇది అభిమానులలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్ డిజైన్ గురించి కొన్ని చిన్న సూచనలను పంచుకుంటున్నప్పటికీ, ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, నథింగ్ 'గ్లిఫ్ లైట్ ఇంటర్‌ఫేస్'ను తొలగించి, స్మార్ట్‌ఫోన్​పై రైట్​ ఎడ్జ్​లో కొత్త 'గ్లిఫ్ ...