భారతదేశం, ఫిబ్రవరి 5 -- గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ పుట్టినప్పటి రోజులను, హాస్పిటల్ లో ఆమెకు జరిగిన ట్రీట్మెంట్ ను తలుచుకుని నిక్ ఎమోషనల్ అయ్యాడు.

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కు ఒక పాప ఉందనే సంగతి తెలిసిందే. 2022లో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి జన్మనిచ్చారు. అయితే పుట్టినప్పుడు మాల్తీ చాలా తక్కువ బరువుతో పుట్టిందని, మూడున్నర నెలల పాటు ఆమెను హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించామని నిక్ జోనస్ వెల్లడించాడు. జే శెట్టి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఇప్పుడు తన కుమార్తె ఎదుగుదలను, ఆమెలోని "మ్యాజిక్"ను చూస్తుంటే తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని నిక్ చెప్పాడు.

మాల్తీ మేరీ పుట్టిన తర్వాత తాము అనుభవించిన భావోద్వేగాలను నిక్ పంచుకున్నాడు. "ఆమె (మాల్తీ) చాలా క్లిష్...