భారతదేశం, అక్టోబర్ 12 -- కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ప్రముఖ గాయని కేటీ పెర్రీ ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది! కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో వీరిద్దరూ ఒక యచ్ట్​లో అత్యంత సన్నిహితంగా గడిపిన దృశ్యాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

ది డైలీ మెయిల్ పత్రికకు అందిన ఫోటోల్లో.. 40ఏళ్ల కేటీ పెర్రీ, 53 ఏళ్ల ట్రూడోను దగ్గరగా కౌగిలించుకుని కనిపించారు. ఈ ఫొటోల్లో కేటీ పెర్రీ నలుపు రంగు వన్-పీస్ స్విమ్‌సూట్ ధరించగా, ట్రూడో చొక్కా లేకుండా జీన్స్ ధరించి ఉన్నారు.

ఓ ఫోటోలో.. ఈ జంట ఒకరినొకరు కౌగిలించుకున్నట్లు కనిపిస్తే, మరొక చిత్రంలో ట్రూడో కేటీ పెర్రీ చెంపకు ముద్దు పెడుతూ ఉంది. ఇంకో ఫోటోలో ట్రూడో, గాయని కేటీ పెర్రీ వెనుక భాగాన్ని ఆనుకుని ఉన్నట్లుగా ఉంది. ఈ చిత్రాలు సెప్టెంబర్‌లో శాంటా బార్బరా తీరంలో తీసినట్లు సమాచారం....