భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి తన బినామీ కంపెనీకి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. KLSR కంపెనీ అవినీతి బాగోతం బయటకు వచ్చిందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. KLSR మొదటి నుండి రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రికి ఆ సంస్థకు మధ్య ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవని కేటీఆర్ నొక్కిచెప్పారు.

దివాలా తీసిన కంపెనీలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందన్నారు. కంపెనీ అవకతవకలపై దర్య్తాప్తు సంస్థలతో విచారణ చేయించాలని జనవరి 23న సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు.

తన బి...