భారతదేశం, ఆగస్టు 29 -- యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న బుల్లెట్​ ట్రైన్​పై బిగ్​ అప్డేట్​! ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంలోని స్టేషన్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవలే తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్​లో రైల్వే మంత్రిత్వ శాఖ పోస్ట్ చేస్తూ.. "గుజరాత్‌లోని ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు స్టేషన్లు పూర్తి కావస్తున్నాయి. ఈ స్టేషన్లు ఆధునిక డిజైన్, సాంస్కృతిక గుర్తింపు, కనెక్టివిటీ, పర్యావరణ అనుకూలత వంటి లక్షణాలతో ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రయాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయి," అని పేర్కొంది.

స్టేషన్ల సంఖ్య నుంచి ప్రయాణ సమయం, ప్రారంభ తేదీ వరకు, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో మొత్తం 12 స్టేష...