భారతదేశం, ఆగస్టు 18 -- భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజల దైనందిన జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోరివలి, థానే, కళ్యాణ్, ములుండ్, పవాయ్, శాంటా క్రజ్, చెంబూర్, వర్లి, నవీ ముంబై, కొలాబా వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ముంబైకి, వరుసగా రెండో రోజు, 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.

ఐఎండీ జారీ చేసే హెచ్చరికలలో 'ఆరెంజ్ అలర్ట్' మూడో స్థాయి హెచ్చరిక. ఇది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తుంది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు కూడా 'యెల్లో', 'ఆరెంజ్' అలర్ట్‌లను ఐఎండీ జారీ చేసింది. పూణెకి రెడ్​ అలర్ట్​ ఇచ్చింది.

ఆదివారం ఉదయం వర్ష తీవ్రత తగ్గినప్పటికీ, ఈరోజు ముంబైలో గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల మే...