భారతదేశం, సెప్టెంబర్ 29 -- మీరు పర్సనల్​ లోన్ కోసం దరఖాస్తు చేసుకుని, అది తిరస్కరణకు గురైందా? కంగారు పడకండి! లోన్ దరఖాస్తు రిజెక్ట్ అవ్వడం చాలా సాధారణమైన విషయం! మీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదా మీ దరఖాస్తుతో పాటు బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి ముఖ్యమైన పత్రాలను సమర్పించకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు!

అసలు పర్సనల్​ లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురి కావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటో, అలాగే ఆమోదం పొందే అవకాశాలను ఎలా పెంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

లోన్ రిజెక్ట్ అవ్వడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని..

I. తక్కువ క్రెడిట్ స్కోర్

పర్సనల్​ లోన్ తిరస్కరణకు అత్యంత సాధారణ కారణాలలో ఇది ఒకటి. క్రెడిట్ కార్డు బిల్లులను ఆలస్యంగా చెల్లించడం లేదా గతంలో తీసుకున్న అప్పులను సరిగ్గా చెల్లించలేకపోవడం వంటివి దీనికి దారితీయవచ్చు. సాధారణంగా, రుణం...