భారతదేశం, ఆగస్టు 29 -- ఇటీవలి కాలంలో, స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలు తమ గ్యాడ్జెట్స్​ని 'వాటర్​ప్రూఫ్​' అంటూ సేల్​ చేస్తున్నాయి. అవి ఏ ప్రమాదం నుంచైనా సురక్షితం అని భావించి మనం కొనుగోలు చేస్తుంటాము. అనుకోకుండా నీటిలో పడిపోవడం లేదా అకాల వర్షంలో తడిసిపోవడం లాంటి సందర్భాల్లో కూడా ఆ చిన్న ఐపీ68 లేబుల్‌.. మన ఫోన్‌కు రక్షణ కల్పిస్తుందని మనం నమ్ముతాము. కానీ మనం అనుకుంటున్న 'సేఫ్టీ' కొద్దికాలం మాత్రమే పని చేస్తుందంటే నమ్మగలరా?

టెక్ ప్రపంచంలో చాలా మంది ఎప్పటి నుంచో అనుమానిస్తున్న విషయాన్ని గూగుల్ ఇప్పుడు ధృవీకరించింది! అదేంటంటే.. మీ ఫోన్‌కు ఉండే వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ జీవితకాలపు గ్యారంటీ కాదు! తన తాజా సపోర్ట్ పేజీల్లో గూగుల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.

"సాధారణంగా ఫోన్‌ను వాడటం వల్ల ఐపీ68 రక్షణ తగ్గిపోవచ్చు," అని గూగుల్ చెప్పింది. అంటే మీ ఫ...