Hyderabad, ఏప్రిల్ 28 -- ఓటీటీలో ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పిల్లలకు సంబంధించిన కంటెంట్ కూడా చాలానే ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకు భారత పురాణ, ఇతిహాసాల గురించి చెప్పాలని మీరు అనుకుంటే.. ఇప్పుడు చెప్పబోయే యానిమేటెడ్ సినిమాలను చూపించండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియ్, జియోహాట్‌స్టార్, యూట్యూబ్‌లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు.

పిల్లలకు ఎంతో ఇష్టమైన దేవుడు గణపతి. అలాంటి దేవుడి మహిహలు, ఆయన చేసిన అడ్వెంచర్లను యానిమేషన్ రూపంలో తీసుకొచ్చిన మూవీ బాల్ గణేష్. దీనిని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. జియోహాట్‌స్టార్ లోనూ అందుబాటులో ఉంది.

మన దేశానికి చెందిన మరో గొప్ప ఇతిహాసం మహాభారతం. దీనిని 2013లో మహాభారత్ పేరుతో ఓ యానిమేటెడ్ సినిమా రూపంలో తీసుకొచ్చారు. దీనిని జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు. ఇందులోనే మహాభారత్ ...