భారతదేశం, అక్టోబర్ 4 -- మీరు రెండేళ్లకు పైగా ఆపరేట్ చేయని బ్యాంక్ అకౌంట్​ ఏమవుతుంది? అది నిరుపయోగంగా (ఇనాపరేటివ్​) మారుతుంది. మరి ఈ అకౌంట్​లో డబ్బు ఉంటే? డబ్బును తిరిగి పొందడం చాలా కష్టమైన పనిలా అనిపించవచ్చు.

అయితే, మీ డబ్బును తిరిగి పొందేందుకు మార్గాలు ఉన్నాయి! నిరుపయోగంగా ఉన్న ఖాతాల నుంచి మీ నిధులను తిరిగి పొందడంలో సహాయపడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన ఆర్బీఐ.. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్లెయిమ్ చేయని ఆస్తులపై ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది.

సాధారణంగా మీ బ్యాంక్ ఖాతాలో రెండేళ్లకు పైగా నుంచి 10 ఏళ్ల వరకు నిరుపయోగంగా ఉన్న డబ్బును ఆర్బీఐ డీఈఏ (డిపాజిటర్​ ఎడ్యుకేషన్​అండ్​ అవేర్​నెస్​) ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఈ నిధిక...