భారతదేశం, సెప్టెంబర్ 29 -- మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం అనుకున్నంత తేలికైన పని కాదు! అప్పులు సమయానికి చెల్లించడం, క్రెడిట్ కార్డు బిల్లును కనీస మొత్తం కాకుండా పూర్తిగా కట్టడం వంటి నియమాలను పాటించాలి. అయితే కేవలం ఇవి మాత్రమే మీ స్కోర్‌ను బలంగా ఉంచడానికి సరిపోవు!

బలమైన క్రెడిట్​ స్కోర్ సాధించడానికి ఇవి మాత్రమే కాక, ఇంకా చాలా విషయాలపై దృష్టి పెట్టాలి. మీ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా, అధిక క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి సహాయపడే ఆరు ముఖ్యమైన టిప్స్​ని ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

I. చెల్లించని బిల్లులు ఉండకూడదు

ముందు చెప్పినట్లుగా, మీ ఖాతాలో చెల్లించని బిల్లులు లేదా బకాయిలు ఏవీ ఉండకూడదు. క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలను గడువు తేదీలోపు ఎప్పుడైనా చెల్లించవచ్చు. ఒక్క రోజు ఆలస్యమైనా పెద్ద తేడా ఉండదని కొందరు భావిస్తారు. కానీ అద...