Hyderabad, సెప్టెంబర్ 11 -- తేజ సజ్జా నటించిన మరో పాన్ ఇండియా మూవీ మిరాయ్ (Mirai). ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికే తేజ నటించిన హనుమాన్ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో మిరాయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూపర్ హీరో సినిమా ఓటీటీ హక్కులకు రికార్డు ధర పలికినట్లు వార్తలు వస్తున్నాయి.

కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా ఓటీటీ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ఈ మూవీ వర్గాలు ఈ విషయం చెప్పినట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఈ హక్కుల కోసం ఏకంగా రూ.40 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమాను రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

అంటే 90 శాతం బడ్జెట్ ఒక్క ఓటీటీ హక్కుల ద్వారానే వచ్చినట్లు లెక్క. ఇదే కాకుండా మూవీ శాటిలైట్, మ్యూ...