Hyderabad, సెప్టెంబర్ 11 -- మిరాయ్.. ఇప్పుడు అందరి కళ్లూ ఈ సినిమాపైనే. తేజ సజ్జా వరుసగా నటించిన రెండో సూపర్ హీరో మూవీ ఇది. అయితే ఈ మూవీ రిలీజ్ కు కొన్ని గంటల ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ట్విస్ట్ ఇస్తూ తేజ పెద్ద సర్‌ప్రైజే ఇచ్చాడు. ఈ సినిమా మొదట్లోనే ఆ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు కూడా అతడు చెప్పాడు.

తేజ సజ్జా గురువారం (సెప్టెంబర్ 11) రాత్రి ఓ ట్వీట్ చేశాడు. అందులో ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. "మరికొన్ని గంటల్లోనే మిరాయ్ మీది కాబోతోంది. ఎంతో పెద్ద మనసున్న శ్రీ ప్రభాస్ గారు దీనిని మరింత ప్రత్యేకంగా మార్చినందుకు కృతజ్ఞతలు. సినిమా మొదట్లోనే రెబెలియస్ సర్‌ప్రైజ్ ను అస్సలు మిస్ కావద్దు" అని తేజ ట్వీట్ చేశాడు.

దీంతో ప్రభాస్ రోల్ ఏంటి? అతిథి పాత్ర పోషిస్తున్నాడా అన్న చర్చ మొదలైంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇ...