భారతదేశం, జూలై 29 -- మిడిల్​ క్లాస్​ భారతీయులకు, 90's కిడ్స్​కి కైనెటిక్​ హోండా అంటే ఒక ఎమోషన్​. కైనెటిక్​ డీఎక్స్​ స్కూటర్​ని మీలో చాలా మంది నడిపే ఉంటారు. అయితే, ఈ మోడల్​ ఇప్పుడు ఎలక్ట్రిక్​ అవతారంలో ఇండియాలో లాంచ్​ అయ్యింది. కైనెటిక్​ డీఎక్స్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.12 లక్షలు కాగా, గరిష్టంగా రూ. 1.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డీఎక్స్, డీఎక్స్+ అనే రెండు వేరియంట్లలో ఈ ఈ-స్కూటర్​ లభిస్తుంది. కైనెటిక్ డీఎక్స్​కు మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని సంస్థ అందిస్తోంది. అదనంగా, కస్టమర్లు తొమ్మిది సంవత్సరాలు లేదా ఒక లక్ష కిలోమీటర్ల వరకు ఎక్​స్టెండెడ్ వారంటీని కూడా పొందొచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ బుకింగ్స్​ సైతం ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ. 1,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చే...