భారతదేశం, ఫిబ్రవరి 5 -- బరాబర్ ప్రేమిస్తా.. టాలీవుడ్ లో ఆటిట్యూడ్ స్టార్ గా పిలుచుకుంటున్న చంద్రహాస్ నటిస్తున్న మూవీ. ఈ సినిమా శుక్రవారం అంటే ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మధ్య జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అతడు స్టేజ్ పైనా గుంజి గుంజి అంటూ ఓ బూతు పాట పాడి షాకిచ్చాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ స్పందించారు.

బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన చిన్న ఈ వివాదంపై స్పందించాడు. అక్కడున్న వాళ్లెవరికీ తమ హీరో అలా చేస్తాడని తెలియదని, తామూ చింతిస్తున్నామని అన్నాడు. "ప్రీరిలీజ్ ఈవెంట్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలన్న ఉద్దేశంతో ఓ పాట పాడాడు. అందులో కొన్ని తప్పులు దొర్లాయి. ఆ పొరపాటు ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులెవరికీ తెలియదు. దీనిపై మేం చింతిస్తున్నాం. అతడు కూడా ఇదే వ...