భారతదేశం, ఫిబ్రవరి 24 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలను చూస్తున్నా, ఒక్క కంపెనీ షేర్లు మాత్రం అప్పర్​ సర్క్యూట్​ని తాకాయి! ఆ ఎస్​ఎంఈ కంపెనీ పేరు టీఏసీ ఇన్ఫోసెక్​. అంతేకాదు ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్​ విజయ్​ కేడియా వద్ద భారీగా షేర్లు ఉన్నాయి.

సోమవారం ట్రేడింగ్ సెషన్​లో టీఏసీ ఇన్ఫోసెక్ షేరు ధర 5% అప్పర్ సర్క్యూట్ పరిమితిని తాకింది. ఎన్ఎస్ఈలో టీఏసీ ఇన్ఫోసెక్ షేరు ధర రూ.1,273 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని, రూ.1,271 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

ఏప్రిల్ 5, 2024 న అరంగేట్రం చేసినప్పటి నుంచి, ఈ టీఏసీ ఇన్ఫోసెక్ షేరు ధర ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే 1,100.9% పెరిగింది! పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.

2024-25 ఆర్థిక సంవత్సరం (హెచ్1 ఎఫ్​వై25) మొదటి అర్ధభాగంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ .13.16 ...