భారతదేశం, ఫిబ్రవరి 1 -- విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో టీడీపీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ నివాసంపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుని రాళ్లు రువ్వడం ప్రారంభించారు. కొంతమంది ఇంటి కొన్ని భాగాలకు నిప్పంటించడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ తన నివాసంలో లేరని తెలిసింది.

శనివారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై జోగి రమేష్ ఘోరమైన కామెంట్స్ చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. టీడీపీ మద్దతుద...