భారతదేశం, అక్టోబర్ 27 -- క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల డీల్ గురించి పుకార్లపై పరోక్షంగా స్పందించాడు. రూ.4 కోట్ల భరణం పుకార్లను లక్ష్యంగా చేసుకుని తన మాజీ భార్యపై చహల్ వ్యంగ్యంగా పంచ్ వేశాడు. ఈసారి అతని సన్నిహిత మిత్రుడు శిఖర్ ధావన్ కూడా ఆ సరదా సంభాషణలో జత కలిశాడు. అసలు ఏం జరిగిందో చూడండి.

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన దీపావళి, భాయ్ దూజ్ వేడుకల ఫొటోలను పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన కుటుంబంతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "కుటుంబంతో కలిసి జరుపుకున్న అందమైన భాయ్ దూజ్. ప్రేమ, చిరునవ్వులు, జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి" అని క్యాప్షన్ ఇచ్చాడు.

అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆ పోస్ట్‌పై చహల్ చేసిన చమత్కారమైన వ్యాఖ్య. చహల్ కామెంట్ చేస్తూ.. "మీ పోజ్‌పై నేను కాపీరైట్ ఫైల్ చేస్...