భారతదేశం, ఏప్రిల్ 30 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే, సమ్మర్ వచ్చేయడంతో బ్రేక్ తీసుకునేందుకు మహేశ్ డిసైడ్ అయ్యారు. పెద్ది షూటింగ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా విరామం తీసుకున్నారట. ఆ వివరాలు ఇవే..

ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‍లోనే సాగుతోంది. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య పాటను రాజమౌళి చిత్రీకరిస్తున్నారని షూటింగ్ అప్‍డేట్ బయటికి వచ్చింది. అయితే, ఈ షెడ్యూల్ నేటితోనే ఫినిష్ కానుందని సమాచారం. దీంతో నెలరోజుల పాటు బ్రేక్ తీసుకోనున్నారట మహేశ్ బాబు.

నెల రోజుల సమ్మర్ బ్రేక్‍లో ఫ్యామిలీతో కలిసి మహేశ్ వెకేషన్‍కు వెళ్లే ఛాన్స్ ఉంది. విరామం తర్వాత మళ్లీ షూటింగ్...