భారతదేశం, జూలై 13 -- మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ శ్రేణికి కొత్త ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ రెవ్​ ఎక్స్​ వేరియంట్​ని యాడ్​ చేశారు. సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఫ్యాషనబుల్, ఫీచర్-లోడెడ్ ఆప్షన్‌ను కోరుకునే కస్టమర్‌ల కోసం ఇది విలువైన ఎంపికగా నిలుస్తుంది. దీని ధర రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. రెవ్​ ఎక్స్​ వేరియంట్ కాస్మెటిక్ అప్‌డేట్‌లు, టెక్నాలజీ అదనంగా, అనేక వేరియంట్‌లు, ఇంజిన్ ఆప్షన్‌లతో మరింత ఆకర్షణీయంగా మారింది. రెవ్​ ఎక్స్​ లైనప్ దాని మూడు ట్రిమ్‌లలో ఏమి అందిస్తుందో ఇక్కడ వివరంగా చూద్దాం.

ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ రెవ్​ ఎక్స్ ఎడిషన్ రెండు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. ఒకటి నేచురల్లీ ఆస్పిరేటెడ్, మరొకటి టర్బోఛార్జ్​డ్​. ఇవి మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంద...