భారతదేశం, ఫిబ్రవరి 4 -- మహాశివరాత్రి అనేది శివుడు, పార్వతీ దేవిల గొప్ప పండుగ. ప్రతీ ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున శివారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భక్తులు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. జ్యోతిష్కులు, గ్రంథాల ప్రకారం, కొన్ని పువ్వులు మహాదేవునికి చాలా ప్రియమైనవి. అయితే కొన్ని పువ్వులను సమర్పించడం వలన గొప్ప ఫలితం కలుగుతుంది, ప్రతికూల ప్రభావాన్ని కూడా తొలగించవచ్చు. మహాశివరాత్రి నాడు పుష్పాలు విషయంలో కొన్ని పాటించాలి. ఈ పూలను సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు, ఆ భక్తుడు ఆనందం మరియు శ్రేయస్సును పొందుతాడు.

మహాశివరాత్రి నాడు ఏయే పువ్వులు సమర్పించాలి, ఏయే సమర్పించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవునికి ఇష్టమైన పువ్వులకు శివ పూజలో ప్రత్యేక స్థానం ఉంది. పువ్వులు శివుని శక్తిని ఆక...