భారతదేశం, జనవరి 31 -- శనివారం (జనవరి 31) మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో SSR61 అనేది తెగ వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్ లో కనిపించింది. టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎస్ఎస్ఆర్61తో పోస్టు పంచుకున్నాడు. దీంతో రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ ఏమో అనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలిసింది. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్లీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.

సింగీతం శ్రీనివాసరావు.. ఈ పేరు వింటే తెలుగు నేలనే కాదు భారత దేశం మొత్తం గర్వంలో పులకించిపోతుంది. అద్భుతం అనే మాటనే చిన్నబోయేలా సినిమాలు తీసిన ఘనత ఆయన సొంతం. ఎవరూ ఊహించని విధంగా చిత్రాలతో ప్రయోగాలు చేశారాయన. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టి తన కలల సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయిపోయారు.

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ...