భారతదేశం, మే 22 -- అర శాతం లాభాలను నమోదు చేసిన మరుసటి రోజే భారత స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనించింది. మే 22 గురువారం నాటి ఇంట్రా డే సెషన్ లో బెంచ్మార్క్ సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తరువాత కొంత పుంజుకుని 645 పాయింట్ల నష్టంతో సెషన్ ను ముగించింది.

సెన్సెక్స్ 81,596.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రా డే సెషన్ లో 1,107 పాయింట్లు లేదా 1.4 శాతం క్షీణించి 80,489.92 వద్ద కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ 50 24,813.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రా డేలో 1.4 శాతం క్షీణించి 24,462.40 వద్ద కనిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 645 పాయింట్లు లేదా 0.79 శాతం క్షీణించి 80,951.99 వద్ద ముగియగా, నిఫ్టీ 204 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 24,609.70 వద్ద ముగిసింది.

మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. బిఎస్ ఇ మిడ్...