Hyderabad, అక్టోబర్ 9 -- బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్‌కు ఆతిథ్యం ఇస్తున్న వెల్స్ స్టూడియోస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హౌస్ మళ్లీ తెరుచుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో గురువారం (అక్టోబర్ 9) తెల్లవారుజామున తిరిగి తెరిచారు. ఈ హౌస్ తిరిగి తెరిచినట్లు శివకుమారే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించడం గమనార్హం.

బిడదిలో ఉన్న బిగ్ బాస్ కన్నడ స్టూడియోను పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ మంగళవారం (అక్టోబర్ 7) సీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లోపే మళ్లీ తెరిచారు. దీనికి సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. "బిడదిలోని జాలీవుడ్ ప్రాంగణంలో బిగ్ బాస్ కన్నడ షూటింగ్ జరుగుతోంది. దానిపై సీల్‌ను తొలగించాలని నేను బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించాను" అన...