Hyderabad, మే 19 -- నిపా వైరస్ గుర్తుందా? కొన్నేళ్ల కిందట అంటే 2018లో కేరళను వణికించి దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో కేరళలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖతోపాటు అక్కడి ఓ మెడికల్ టీమ్ దానిని సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు అసలు అది ఎక్కడ మొదలైందన్నది కూడా గుర్తించారు. ఈ రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించిన మూవీయే వైరస్. ఇప్పుడీ సినిమా యూట్యూబ్‌లోనూ తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళం మూవీ వైరస్ ను కేరళలోని కోళికోడ్ జిల్లాలో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. అక్కడ జకారియా మహ్మద్ అనే ఓ పేషెంట్ ఓ ఇన్ఫెక్షన్ తో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చేరతాడు. కొన్నాళ్లపాటు ఆ వైరస్ తో పోరాడి కన్నుమూస్తాడు. అతనికి సీటీ స్కాన్ తీసిన గీత అనే అమ్మాయి కూడా వైరస్ బారిన పడుతుంది.

ఆ తర్వాత జకారియాకు చికిత్స అందించిన నర్స్ అఖిలను కూడా ఆ వైరస్ వదలదు...